హలో ఎలా ఉన్నారు..నేను మళ్లీ చాలా కాలం తరవాత వస్తున్నాను..కాబట్టి నాకైతే కొత్తగానే ఉన్నది..ఇక పొతే ఇప్పుడు అంతావర్షాల సీసన్ కదా..అంతా నీళ్ళు మురికి..జాగ్రత్తగా ఉండకపోతే అంటే..జలుబు పట్టేస్తుంది..
ఈమధ్యనే ఒక సెమినార్కి వెళ్లి వచ్చాను..అది ఏమిటంటే రామచంద్రాపురంలో ఒక యు జి సి సెమినార్ జరిగింది..తెలుగు, హిందీ , సాంస్క్రిట్ లో జరిగింది..నేను హిందీలో ఇచ్చి వచ్చాను..పేపర్ ప్రెజెంట్ కూడా బాగానే చేసాను..ఇక పొతే అక్కడ వాళ్ళ ఆతిథ్యం ఎంతో బాగుంది..చక్కగా రూం ఇచ్చి గౌరవించారు..ఎంతో మర్యాద..ఇక పొతే ఆ వాతావరణం కూడా ఎంతో బాగుంది..చక్కని పంట పొలాల మధ్య కట్టిన పెద్ద కాలేజే వి ఎస్ ఎం ..
అక్కడ ఉన్న వాళ్ళలో ఎంతో చక్కగా తెలుగు ప్రెజెంట్ చేసినవారిలో నాకు నచ్చిన ఒక కవితని ఇక్కడ ఇస్తున్నాను..చూడండి..
"పెళ్లి కాకముందు ప్రేయసి...ఆమె మాట్లాడితే ముత్యాలు రాలతాయన్నాడు....పెళ్లి అయ్యాక పెళ్ళాం ..ఇప్పుడు ఆమె మాట్లాడితే పళ్ళు రాలతాయంటున్నాడు. ..!~!


